విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా సైడ్ డ్రెయిన్స్ సమస్య, పూడిక సమస్య తీవ్రంగా ఉందని గత ప్రభుత్వ హయాంలో దీనిపై దృష్టి పెట్టకపోవడంతో వర్షం పడినపుడల్లా రోడ్లు మునిగిపోతున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. శనివారం ఆయన 7వ డివిజన్లో స్థానిక నేతల పెనుగొండ శ్రీను, మాదల మల్లికార్జునరావు వెంటరాగా డ్రైయిన్స్ను పరిశీలించారు. చాలాచోట్ల డ్రెయిన్స్లో సిల్టు ఉండటం గమనించారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేయిస్తానని చెప్పారు.