వంద రోజుల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పురోగతి సాధించామని పవన్ కల్యాణ్ తెలిపారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా రూ.998.62 కోట్లు విడుదల అయ్యాయని చెప్పారు. ‘‘70 శాతం పంచాయతీల్లో వైసీపీ సానుభూతి పరులే ఉన్నారు. ఆ పంచాయతీల్లో కూడా కూటమి ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించాం. 13,326 గ్రామ సభలు నిర్వహించడం ద్వారా రికార్డు సాధించాం. ఉపాధి హామీ కూలీలకు రూ.2,081 కోట్లు చెల్లించాం. 4500 కోట్ల పనులకు గ్రామ సభల ఆమోదం తీసుకున్నాం’’ అని చెప్పారు