తెనాలి మండల పరిధిలోని అంగలకుదురు శివారులో ఓ యువకుడు (30) ఉరివేసుకున్న ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. తెనాలి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివారులోని నిమ్మ తోటలో మృతదేహం తీరును చూసి శనివారమే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావించారు. మృతుడు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా అంచనా వేస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.