ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

international |  Suryaa Desk  | Published : Mon, Jan 13, 2025, 09:15 PM

సోమవారం జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. భారీ భూకంపం ధాటికి జపాన్ నైరుతి ప్రాంతం వణికిపోయింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రత నమోదైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. నైరుతి జపాన్‌లోని క్యూషూ ద్వీపంలోని కొచ్చి ప్రిఫెక్చర్ ప్రాంతంలో ఈ భారీ భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:19 గంటలకు భూకంపం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. క్యుషు ద్వీపంలోని మియాజాకి ప్రిఫెక్చర్ సమీపంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ఒక మీటర్ వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది.


అయితే సముద్రంలో 48 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలోనే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఎంతమేరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది అనే దానిపై అధికారులు స్పష్టం చేయలేదు. గతేడాది ఆగస్ట్‌ నెలలోనూ రెండు భారీ భూకంపాలు జపాన్‌ను సంభవించాయి.


ఇక తాజాగా సంభవించిన భూ కంపంతో జపాన్‌లో భవనాలు కొన్ని దెబ్బతిన్నాయి. మరికొన్ని బిల్డింగ్‌లు కూలిపోయాయి. భూ ప్రకంపనల ధాటికి భవనాల్లో ఉన్న ప్రజలు.. బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం సంభవించిన సమయంలో అక్కడ ఉన్నవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com