గ్రామా ల్లో మౌలిక సౌకర్యాలు కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని శ్రీకాకుళం ఎమ్యెల్యే గొండు శంకర్ తెలిపారు. మంగళవా రం గార, ఆరంగిపేట కరణాలపేట, కుమ్మరి పేట తదితర గ్రామాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆరంగిపేట నుంచి కొర్ని వరకు బీటీ రోడ్డుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పల్లె వెలుగు బస్సుల ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యాలను అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పీసా వెంకటరమణమూర్తి గార మాజీ సర్పంచ్ బడగల వెంకట అప్పారావు,గార పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీమాజీ చైర్మన్ కొంక్యాణ రమణమూర్తి, సర్పంచ్ కె.ఆదినారాయణ పాల్గొన్నారు.