వాహనం లోయలో పడటంతో ముగ్గురు బీఆర్ఎస్ జవానులు మృతి చెందిన ఘటన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 13 మంది సైనికులు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.సైనికులతో వెళుతున్న ట్రక్ అదుపుతప్పి లోయలో పడిపోవడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. ఈ ఘటనపై మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa