2025 IPL లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఎల్ క్లాసికో ఉత్కంఠభరితంగా సాగింది. ఆదివారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ చేసిన స్టంపింగ్ హాట్ టాపిక్ అవుతుంది. ధోనీకి నిజంగానే 43 ఏళ్లు ఉంటాయా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కేవలం 0.12 సెకన్లలో ధోనీ వికెట్లను గిరాటేయడంతో షాకవడం ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వంతయింది. భారత మాజీ కెప్టెన్ MS Dhoni కీపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆ స్టంపింగ్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కీలక భాగస్వామ్యం నెలకొల్పుతున్న సమయంలో ధోనీ చేసిన స్టంపింగ్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. స్పిన్నర్ నూర్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ జస్ట్ ఒక్క అడుగు ముందుకేశాడు. అంతే రెప్పపాటులో ధోనీ స్టంపింగ్ చేశాడు. సూర్యకుమార్ క్రీజులోకి కాలు పెట్టేలోపే కేవలం 0.12 సెకన్లలోనే ధోనీ వికెట్లను గిరాటేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2025
![]() |
![]() |