అవనిగడ్డ మండలం గుడివాక వారిపాలెం - వేకనూరు గ్రామాల మధ్య నాగాయలంక రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్టివా, పల్సర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, అంబులెన్స్ లో అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అవనిగడ్డ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
![]() |
![]() |