ఏపీలోని నంద్యాలలో హిజ్రాలు వీధి పోరాటాలకు దిగారు. బిక్షాటన విషయంలో నంద్యాల, పాణ్యం ప్రాంతాలకు చెందిన హిజ్రాల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసుల ముందే కారం చల్లుకుని, రాళ్లు విసురుకుంటూ భయానక వాతావరణం సృష్టించారు. పాణ్యంకు చెందిన హిజ్రాలు ఇటీవల నంద్యాలలో భిక్షాటన చేస్తుండడం ఈ గొడవకు కారణం. ఇవాళ నంద్యాల, పాణ్యం హిజ్రాలు రూరల్ పోలీస్ స్టేషన్ ముందే పరస్పరం ఎదురయ్యారు. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో 100 మంది హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
![]() |
![]() |