AP: సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కోసం పట్టుచీర కొన్నారు. బాపట్ల, కొత్తగొల్లపాలెంలో పింఛన్ల పంపిణీలో భాగంగా సీఎం ప్రజావేదిక దగ్గరలో ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. వాటిలో చీరాల పట్టుచీరలు ఆయనను ఆకర్షించడంతో భువనేశ్వరికి పొదుపు సంఘం సభ్యురాలు చింతం మయూరి నుంచి రూ.12 వేలు చెల్లించి పట్టుచీర కొన్నారు. వ్యాపారం బాగా చేసి నెలకు కనీసం రూ.40 నుంచి 50 వేలు సంపాదించాలని ఆమెకు సూచించారు.
![]() |
![]() |