తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి వద్ద కంటైనర్ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తీ సమాచారం తెలియాల్సిఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa