గంగమ్మ ఆలయ పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. గంగ జాతర సందర్భంగా ఆలయంలో యాత్రికులకు కల్పించిన ఏర్పాట్లను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో మాట్లాడి వారికి కావాల్సిన సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతర కు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa