ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో ఆనందోత్సవాలు జరుపుకున్నారు. మహాత్మగాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాలతో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. భారత సైన్యానికి జాతీయ జెండాలతో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఏ సమయంలోనైనా యుద్ధం వచ్చే అవకాశం ఉందన్నారు. శాంతియుత దేశమైన భారతదేశంలో దుశ్చర్యలకు పాల్పడుతున్న వారికి సరైన గుణపాఠం చెప్పాలన్నారు. భారత సైన్యానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa