కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి భద్రత పెంచారు. ఆయనకు ప్రస్తుతం వై-కేటగిరీ భద్రత ఉండగా దాన్ని ఇప్పుడు వై-ప్లస్ కేటగిరీకి పెంచారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు గన్‌మెన్లతో పాటు మరో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ అధికారులతో కలిపి మొత్తంగా మంత్రికి నలుగురు సిబ్బంది భద్రతగా ఉండనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన చీఫ్ సెక్యూరిటీ అధికారి, సీఆర్‌పీఎఫ్ కమాండో గురువారం విధుల్లో చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa