సరిహద్దుల్లో నిఘా సామర్థ్యాన్ని పెంచి, దేశ భద్రతను పటిష్ఠం చేసే అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం రీశాట్-1బీ ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ వేదికగా ఆదివారం ఉదయం 5:59 గంటలకు పీఎ్సఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా ఈవోఎస్-09 (రీశాట్-1బీ) ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 7:59 గంటలకు ప్రారంభించనున్నారు. 22 గంటలపాటు కొనసాగే ఈ కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎ్సఎల్వీ-సీ61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తిచేసుకుని ప్రయోగ వేదికపైనున్న పీఎ్సఎల్వీ-సీ61 రాకెట్‌కు శాస్త్రవేత్తలు శుక్రవారం తుది పరీక్షలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa