బాపట్ల జిల్లా, వేమూరులో ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. సమచార శాఖ మంత్రి పార్దసారధి , జిల్లా కలెక్టర్ మురళీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేమూరు సెంటర్‌లో చలివేంద్రం ప్రారంభించారు. రైతులకు వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేశారు. స్వచ్ఛంద - స్వర్ణాంధ్రలో భాగంగా మానవహారం నిర్వహించారు. వేమూరులో రోడ్ల వెంట మంత్రి పార్దసారధి, ఎమ్మెల్యే ఆనంద బాబు మొక్కలు నాటారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలతో మంత్రి పార్దసారధి ప్రతిజ్ఞ చేయించారు. ఉచిత వైద్య శిభిరాన్ని పార్దసారధి, ఆనంద బాబు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa