దేశ సరిహద్దుల్లో నిఘా సామర్థ్యాన్ని పెంచి, దేశ భద్రతను పటిష్ఠం చేసే అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం రీశాట్-1బీ ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది. పీఎస్ఎల్వీ-సీ61 ద్వారా ఈఓఎస్-09 (రీశాట్-1బీ) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా సమీక్ష జరిగింది. జనవరిలో రోదసిలోకి పంపిన ఎన్వీఎస్-02 ఉపగ్రహం సాంకేతిక సమస్యలు ఏర్పడి నిర్ణీత కక్ష్యలోకి వెళ్లలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పీఎస్ఎల్వీ-సి61 ప్రయోగంలో ప్రతి అంశాన్ని శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa