జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పరిస్థితిని నిరంతరం సమీక్షించి, ప్రజలకు సహాయం అందించేందుకు ప్రకాశం భవనంలో 1077 టోల్ ఫ్రీ నంబర్‌తో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కంట్రోల్ రూమ్ ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిరంతరాయంగా పని చేస్తుందని ఆమె వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను తక్షణం పరిష్కరించేందుకు ఈ కంట్రోల్ రూమ్ సహాయపడుతుందని, అవసరమైన వారు 1077 నంబర్‌కు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa