అనంతపురం జిల్లా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నాడు పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్, కోశాధికారి బండారు శంకర్ కలిసి జిల్లా విద్యాధికారి (డీఈఓ)కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నారాయణ, శ్రీ చైతన్య వంటి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండానే అక్రమంగా అడ్మిషన్లు చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే ఈ సంస్థలు విద్యార్థులపై ఆర్థిక భారం మోపుతూ ఫీజుల దోపిడీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని పట్టించుకుని సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ నేతలు డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని వారు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa