ఒక దారుణమైన ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచింది. మంచినీటి కోసం ఫ్రిడ్జ్ తెరిచిన సమయంలో విద్యుదాఘాతానికి గురై 14 ఏళ్ల బాలుడు దశ్వంత్ ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల ప్రకారం, దశ్వంత్ చందక కూడలిలో టిఫిన్ కోసం వెళ్లాడు. ఆ సమయంలో తాగడానికి నీరు అవసరమై పక్కనే ఉన్న కిరాణా దుకాణంలోకి వెళ్లి ఫ్రిడ్జ్ తెరిచాడు. అయితే ఆ ఫ్రిడ్జ్‌లో ఎలక్ట్రికల్ లోపం ఉండటంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఒక్కసారిగా షాక్ తగిలి కిందపడిపోయిన దశ్వంత్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ విషాద ఘటన గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. స్థానికులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు. విద్యుత్ పరికరాల నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa