తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం విజయవాడ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న కొరియర్ లోడు వ్యాను నల్లజర్ల దగ్గర అదుపుతప్పింది. ఈ క్రమంలోనే ముందు వెళుతున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మేకల వెంకట్ కు కుడి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa