విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. శనివారం ఉదయం బెంజ్ సర్కిల్ సమీపంలోని ఓ భవనంలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన ముగ్గురిలో ఒకరిపేరు ముత్యాలమ్మగా గుర్తించామని, మిగతా ఇద్దరి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa