తొలిసారి దేవునిగడప కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈసారి మహానాడు చరిత్ర సృష్టించబోతోందని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకుగానూ 7 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు. ఈసారి మరింత కష్టపడి మొత్తం 10 స్థానాలు గెలవాలని ఈ సందర్భంగా పార్టీ కేడర్‌కు ఆయన సూచించారు.కడప మహానగరం వేదికగా మహానాడు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. జెండా మోస్తున్న కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa