దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన పెనుకొండ దర్గా – హజరత్ ఖ్వాజా సయ్యద్ షా బాబా ఫరీద్ షక్కర్ శ్రీ చిన్న బాబయ్య స్వామి గంధ మహోత్సవాన్ని ఈ నెల 14న శనివారం నాడు ఘనంగా నిర్వహించనున్నట్టు దర్గా కమిటీ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ గంధ మహోత్సవం ప్రతి సంవత్సరం విశేష భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతుంది. శనివారం రాత్రి గంధ కార్యక్రమం జరగనున్నది. అలాగే, జూన్ 15న ఆదివారం రాత్రి ఉరుసు సందర్భంగా ఖవ్వాలి కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది.
విలక్షణ ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచిన ఈ దర్గా ఉత్సవానికి దక్షిణ భారతదేశం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa