AP: కాకినాడలోని రేచర్లపేటలో ఒకే గదిలో తల్లి, కొడుకు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. రమ్యదీప్తి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, చనిపోయిన ఆమె నాలుగేళ్ల కుమారుడు ప్రశాంత్ చేతులు, కాళ్లు, నోరు, ముక్కుపై ప్లాస్టర్లు కనిపించాయి. 2 నెలల క్రితం రమ్యదీప్తి అబుదాబి నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa