బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో విధులు నిర్వహిస్తోన్న ఆమె కుమార్తె సైమా వాజెద్ ను సెలవుపై పంపించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెపై అవినీతి కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయం ఢిల్లీలో ఉంది. సైమా స్థానంలో డాక్టర్ కేథరీనా బోహ్మే తాత్కాలిక బాధ్యతలు స్వీకరించారు.సైమా వాజెద్ డబ్ల్యుహెచ్‌వో ఆగ్నేయాసియా రీజినల్ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే, మీడియా అడిగిన ఓ ప్రశ్నకు, ఆమె ప్రస్తుతం సెలవులో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు సమాధానమిచ్చారు. బంగ్లాదేశ్‌లోని అవినీతి నిరోధక కమిషన్ షేక్ హసీనా కుమార్తెపై అధికార దుర్వినియోగం, మోసం, ఫోర్జరీ అభియోగాలను మోపింది.షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో మాజీ ప్రధానికి ఇది మరో ఎదురుదెబ్బ. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షఫీఖుల్ అలామ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa