ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు భారత్-శ్రీలంక మధ్య ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025

sports |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 05:46 PM

ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీ నేటి నుంచే ప్రారంభం కానుంది. ఇక తొలి మ్యాచ్ విషయానికొస్తే, గువాహటిలో మధ్యాహ్నం 3 గంటలకు భారత్-శ్రీలంక మధ్య పోరు ప్రారంభమవుతుంది. వన్డేల్లో ఈ రెండు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే భారత్‌దే స్పష్టమైన ఆధిపత్యం. ఇప్పటివరకు ఆడిన 35 మ్యాచ్‌లలో టీమిండియా 31 సార్లు గెలవగా, శ్రీలంక కేవలం 3 మ్యాచ్‌లలోనే విజయం సాధించింది. ఈ గణాంకాలు ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచే అంశం. ఈ మ్యాచ్‌ను జియో హాట్ స్టార్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa