గత ఐదేళ్లలో వెండి ధరలు భారీగా పెరిగాయి. 2020లో కిలో వెండి ₹63,435 ఉండగా, ఇప్పుడు దాదాపు ₹2 లక్షలకు చేరింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడమే ప్రధాన కారణం. ఫోన్లు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో వినియోగం పెరిగింది. భారత్ వెండి వినియోగంలో అగ్రగామి అయినా, 80% దిగుమతులపై ఆధారపడుతోంది. ఉత్పత్తి తగ్గడం వల్ల భవిష్యత్తులో వెండి లభ్యత కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa