ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో, ఈ కీలక బదిలీ ప్రక్రియ పూర్తయింది.
కొత్తగా ఏపీ హైకోర్టుకు బదిలీ కానున్న ముగ్గురు న్యాయమూర్తులు ఇవే:
-జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ – గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీ.
-జస్టిస్ డూండి రమేష్ – అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీ.
-జస్టిస్ సుభేందు సమంత – కలకత్తా హైకోర్టు నుంచి బదిలీ.
ముగ్గురు న్యాయమూర్తులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం ముందుగానే సిఫారసు చేసింది. ఆ సిఫారసులకు ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో, ఈ జడ్జీలు త్వరలోనే ఏపీ హైకోర్టులో తమ బాధ్యతలు స్వీకరించనున్నారు.న్యాయ వర్గాల అంచనా ప్రకారం, ఈ బదిలీలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవ్యవస్థ బలోపేతానికి, అలాగే పెండింగ్ కేసుల పరిష్కార వేగవంతానికి దోహదం చేయనున్నాయి. ఈ పరిణామం ప్రస్తుతం న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa