మహారాష్ట్రలోని జల్నా జిల్లా సోమ్తానాలో దారుణం చోటుచేసుకుంది. మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య మనీషా, తన భర్త పరమేశ్వర్ రామ్ టేడేను తమ్ముడు జ్ఞానేశ్వర్ తో కలిసి గొడ్డలితో నరికి చంపింది. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి వాలా-సోమ్తానా చెరువులో పడేశారు. చెరువులో తేలుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితులను పట్టుకుని విచారించగా, నేరం అంగీకరించారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa