2019-2024 వైసీపీ పాలనలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు సిట్ నివేదిక తేల్చడంతో హిందూ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు ప్రాయశ్చిత్తంగా, పార్టీ ఆదేశాల మేరకు గురువారం ఓర్వకల్లు మండలం కాల్వ బుగ్గ శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానంలో శుద్ధి పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి స్వయంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa