కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలోని ప్రతి కణంలో కనిపించే మైనపు, కొవ్వు పదార్థం. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్. రెండో చెడు కొలెస్ట్రాల్. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఉండటం మంచిదే. శరీరం జీర్ణక్రియ, విటమిన్ డి ఉత్పత్తి, హార్మోన్ల సమతుల్యత కోసం దాని అవసరాలకు అనుగుణంగా కొలెస్ట్రాల్‌ని ఉత్పత్తి చేస్తుంది. అయితే, మనం జిడ్డుగల లేదా అనారోగ్యకరమైన ఆహారాలు తిన్నప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుంది.
ఈ కొలెస్ట్రాల్ రక్త నాళాలకు( ధమనుల గోడలకు) అతుక్కపోతుంది. అది పేరుకుపోయినపప్పుడు ఫలకంలా పేరుకుపోతుంది. క్రమంగా ఇది ధమనుల్ని అడ్డుకోవడం ప్రారంభిస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇక, కొలెస్ట్రాల్ తగ్గించడానికి వివిధ మందుల్ని ఆశ్రయిస్తారు.
అయితే, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ని సహజంగా తగ్గించవచ్చని నిపుణులు. కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయని న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా అంటున్నారు. పండు నుంచి కూరగాయ వరకు, టీ నుంచి జ్యూస్ వరకు ఏమేం ఫుడ్స్ తినాలో వివరించారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పండ్లలో బొప్పాయిదే అగ్రస్థానం
కొలెస్ట్రాల్ తగ్గేందుకు పండ్లలో బొప్పాయి తప్పనిసరిగా తీసుకోవాలని శ్వేతా షా చెబుతున్నారు. బొప్పాయి కొలెస్ట్రాల్‌కి మంచి నివారణ అంటున్నారు. బొప్పాయిలో విటమిన్లు సి, ఎ, ఫోలేట్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి.
ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ కొలెస్ట్రాల్‌ని నియంత్రణలో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో జీర్ణక్రియకు మంచిదని భావించే పపైన్ కూడా ఉంటుంది. మీరు భోజనం తర్వాత లేదా ఎప్పుడైనా బొప్పాయి తినవచ్చు. అయితే, రాత్రి పూట తినొద్దని శ్వేతా షా సలహా ఇస్తున్నారు.
కూరగాయల్లో బెండకాయ
కూరగాయల్లో బెండకాయ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా చెబుతున్నారు. బెండకాయలో ఫైబర్, విటమిన్లు సి, కె, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మెగ్నిషియం, ఐరన్, పొటాషియం కూడా ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి బెండకాయ మంచి ఆప్షన్ అంటున్నారు నిపుణులు.
పసుపు చేసే మ్యాజిక్
వంటగదిలో పసుపుకు మించిన ఔషధం లేదు. పసుపులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. పసుపు కొలెస్ట్రాల్‌ని తగ్గించడమే కాకుండా అనేక వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గును నివారిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది టాక్సిన్లు బయటకు పంపడంలో సాయపడుతుంది. మీరు పసుపును ఆహారంలో తీసుకోవచ్చు. లేదంటే పసుపు నీటిని లేదా పసుపు పాలను తాగవచ్చు.
మందారం జ్యూసుతో కొలెస్ట్రాల్‌కి చెక్
జ్యూసుల విషయానికొస్తే మందారం పూలతో చేసినది బెస్ట్ అంటున్నారు న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా. మందార పూల రెమ్మలతో చేసిన జ్యూసు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మందారంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు (ఆంథోసైనిన్లు), ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ అంశాలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచడంలో సాయపడతాయి. ఈ జ్యూసుని ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా తాగవచ్చని శ్వేతాషా చెబుతున్నారు.
చియా సీడ్స్ చేసే మేలేంటో తెలుసా?
చియా సీడ్స్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ప్రభావవంతంగా మంచి ఆప్షన్. చియా విత్తనాలు అనేక ఆరోగ్య పరిస్థితులకు ప్రయోజనకరంగా ఉంటాయి. చియా విత్తనాల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం ఉంటాయి. అవి కొలెస్ట్రాల్ తగ్గించడానికి, జీవక్రియను పెంచడానికి సాయపడతాయి. అయితే, చియా విత్తనాల్ని నేరుగా తినకూడదు. చియా విత్తనాల్ని నీటిలో నానబెట్టి తాగాలి.
బాదం పప్పు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది
ఇక బాదం పప్పు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాదం పప్పు గుండె, మెదడుకు మంచిదే. ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడుతుంది. బాదం పప్పులో అధిక నాణ్యత గల ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు, విటమిన్ ఈ ఉంటాయి. రోజూ 4-5 బాదం పప్పులు తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు.
దాల్చిన చెక్క టీ చేసే మేలు
దాల్చిన చెక్క టీ తాగడం వల్ల మధుమేహం ఉన్నవారికి మాత్రమే కాకుండా, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దాల్చిన చెక్కలో రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడే సమ్మేళనాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు (A, C, K, మరియు B-కాంప్లెక్స్) కూడా పుష్కలంగా ఉంటాయి.
తృణధాన్యాల్లో బార్లీ తీసుకోండి
ఇక తృణధాన్యాల విషయానికి వస్తే, బార్లీని అత్యంత ఆరోగ్యకరమైన వాటిలో ఒకటిగా పరిగణిస్తారు. బార్లీని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. బార్లీ పిండిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడమే కాకుండా శరీరానికి మేలు జరుగుతుందని నిపుణులు వివరించారు. బార్లీ పిండిలో ఫైబర్, విటమిన్లు (బి-కాంప్లెక్స్), ఖనిజాలు (ఐరన్, మెగ్నీషియం) ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa