రాశి-మేషం :మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకం ఎదురైనా.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అజాగ్రత్తగా ఉండకండి.
రాశి- వృషభం: ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సంకల్పబలంతో ముందుకు సాగి ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీ ఆదాయం పెరగడం, రావలసిన డబ్బు తిరిగి రావడం జరుగుతుంది. పెట్టుబడుల నుంచి కూడా మంచి రాబడులు ఉంటాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అధికారుల సహకారం ఉంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు. కొత్తవారి విషయంలో జాగ్రత్త అవసరం.
రాశి- మిధునం: అవసరాలు వాయిదా వేసుకుంటారు. మనోబలంతో ముందుకుసాగి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కాని, అనుకున్న మార్పు కాని చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. మాట పట్టింపులకు పోరాదు. మీ సంతానం కారణంగా ఆనందాన్ని పొందుతారు.
రాశి- కర్కాటకం: ఊహించని విధంగా లభించిన ఖాళీ సమయంలో భవిషత్ ఆలోచనలు చేస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేశారు. మానసిక ప్రశాంతతో ముందుకుసాగితే ఫలితాలు అందుకుంటారు. పాత మిత్రులను కానీ, దూర దేశంలో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.
రాశి-సింహం: నిరుద్యోగులు మరింత కృషి చేయాలి. శ్రమతో కూడిన ఫలితాలు అందుకుంటారు. మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. మనోనిబ్బరం అవసరం. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల సలహాలు ఫలిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.
రాశి-కన్య: వైద్య, పోలీస్, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. బుద్ధిబలంతో చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వాహనం కొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు కాని ఒక కొలిక్కి వస్తాయి. విశ్రాంతి అవసరం.
రాశి- తుల: వ్యాపారాలు కుంటుపడతాయి. ధర్మబద్ధంగా ముందుకుసాగి పనులు పూర్తిచేస్తారు. అనుకున్న ఫలితాలు రాబట్టడానికి అనుకూల సమయం. గృహసంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ, వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
రాశి- వృశ్చికం: దూర ప్రయాణాలకు అవరోధం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా చిత్తశుద్ధితో పనులు పూర్తిచేస్తారు. సాయం చేస్తా అన్నవారు సమయానికి మాట మార్చడంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు జాగ్రత్త అవసరం. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి.
రాశి- ధనస్సు: ఇబ్బందులు, చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. చంచల బుద్దిని వీడి లక్ష్యంపై దృష్టిని సారిస్తే విజయం తథ్యం. బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంది. కలహాలకు తావివ్వరాదు.
రాశి-మకరం: కొన్ని రంగాల ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. మనోబలంతో పనులు పూర్తిచేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలలో ఆత్మీయుల సలహాలు మేలుచేస్తాయి. మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురి చేసిన వారవుతారు. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
రాశి- కుంభం: ఖాళీ సమయంలో భార్య బిడ్డలతో ఆనందిస్తారు. ఉత్సహంతో పనిచేస్తే పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రశాంతంగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరులతో మాట్లాడేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది.
రాశి- మీనం :ధనానికి అంతగా ఇబ్బంది ఉండదు. గ్రహబలం అనుకూలిస్తుంది. అభివృద్ధికై చేసే ప్రయత్నం ఫలిస్తుంది. స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయమిది. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్దలు తొలగిపోతాయి. ముఖ్య వవహారాల్లో నిర్లక్ష్యం చేయరాదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa