వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మంత్రి కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ పదవీ వ్యామోహాన్ని తగ్గించుకుంటే మంచిదని, తండ్రి నీడలో లక్ష కోట్లు వెనకేసుకున్న ఆయన సీఎం కావాలని ఆరాటపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వానికి వయసు మీరిపోయిందని, డీలిమిటేషన్ ను అడ్డుకుంటే ఆ పార్టీకి నూకలు చెల్లిపోతాయని, సుస్థిర ప్రభుత్వం కోసం నియోజకవర్గాల పునర్విభజన అవసరమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa