ఈపీఎఫ్ఓ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న గరిష్ఠ బీమా కవరేజీ రూ.6 లక్షల నుంచి దాన్ని రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. మరణించడానికి ముందు 12 నెలల్లో ఒకటికి మించిన సంస్థల్లో పని చేసినా బీమా సదుపాయాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. తాజా నిర్ణయం ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనకరంగా ఉండనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa