కేంద్ర యూనియన్ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటెల్ సోమవారం మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సోమవారం మధ్యాహ్నం 12: 30 గంటలకు విశాఖ చేరుకోనున్న ఆయన విశాఖ ఆటో నగర్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం లాసన్స్ బే కాలనీ వద్దనున్న బి. జే. పి హెడ్ క్వాటర్స్ లో పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విశాఖ రైల్వే స్టేషన్ చేరుకున్న ఆయన రైలు మర్గాన్న పలాస చేరుకుని పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి విశాఖ చేరుకుంటారు.