ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజస్థాన్‌ రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Apr 19, 2022, 11:23 PM

రాజస్థాన్ రాష్ట్రంలోని ఝున్‌ఝును జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీని జీపు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. ఝున్‌ఝును -గుఢా గోడ్జి హైవేపై ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని జీపు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa