ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్మకాయలు తీసుకోనాయనా...ఇంతకంటే మంచి గిఫ్ట్ లేదు మరి

national |  Suryaa Desk  | Published : Tue, Apr 19, 2022, 11:52 PM

మండుతున్న ధరల నేపథ్యంలో నిమ్మకాలు చూడటం తప్పా కొనే పరిస్థితి లేకపోయింది. ఈ పరిస్థితిని కళ్లకుకట్టినట్లు చూపేందుకు ఓ వరుడి స్నేహితులు ప్రయత్నించారు. ఈ వేసవిలో నిమ్మకాయల ధరల మోత మోగిపోతున్నాయి. నిమ్మకాయలు అత్యంత ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. అందుకే ఓ పెళ్లి వేడుకలో స్నేహితులు వధూవరులకు గిఫ్ట్‌గా నిమ్మకాయలను అందించారు. ఇది గుజరాత్‌లో జరిగింది. రాజ్‌కోట్‌లోని ధరోజీ పట్టణంలో ఓ జంట వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లికి వరుడు స్నేహితులు వెళ్లారు. అయితే వారంతా కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్న వధూవరులకు నిమ్మకాయలను బహుమతిగా అందజేశారు.


నిమ్మకాయలు ధరలు బాగా పెరిగాయని, ఈ సీజన్‌లో నిమ్మకాయల వినియోగం కూడా ఎక్కువగా ఉంటుందని అందుకే వాటినే గిఫ్ట్‌గా ఇచ్చామని వారు చెప్పారు "ఈ సమయంలో రాష్ట్రంలో దేశంలో నిమ్మకాయల ధరలు భారీగా పెరిగాయి.. ఈ సీజన్‌లో నిమ్మకాయల అవసరం ఎక్కువగా ఉంది.. అందుకే నిమ్మకాయలు ఇచ్చాం" అని వరుడి బంధువు దినేష్‌ చెప్పారు.


ఇదిలావుంటే రాజ్‌కోట్‌లో నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటాయి. డిమాండ్ ఎక్కువగా ఉండే ఈ సీజన్‌లో కేజీ రూ.200లకు విక్రయిస్తున్నారు. సప్లై తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. ఈసారి నిమ్మకాయల ఉత్పత్తి తక్కువగా ఉందని వ్యాపారులు చెప్పారు. అయితే ఎండాకాలం కావడం, పండుగలు, పెళ్లిళ్లు సీజన్ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉందని అంటున్నారు. రాజ్‌కోట్‌లో ప్రస్తుతం నిమ్మకాయలతో పాటు మిరప ధర కూడా ఎక్కువగానే ఉంది.


ఇదిలా ఉండగా తమిళనాడులో కొంతమంది స్నేహితులు కొత్త జంటకు పెట్రోల్‌ను బహుమతిగా అందజేశారు. ఒక బాటిల్‌ నిండా పెట్రోల్ నింపి బహుమతిగా అందజేశారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు అత్యధికంగా పెరగడంతో దానినే గిఫ్ట్‌గా ఇచ్చామని చెప్పారు. కాగా ఇలాంటి సంఘటనలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com