కాపు వర్గానికి పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైరయ్యారు. 'కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు పవన్ తాకట్టుపెట్టారు. చంద్రబాబు చెప్పాలనుకున్న మాటలను షూటింగ్ గ్యాప్లో పవన్ ట్వీటర్లో చెప్తున్నాడు. ఫ్యాన్స్ కేరింతలు కొడుతుంటే పవన్ సంబరపడిపోతున్నాడు. సినీ వ్యామోహంతో కొందరు జనసేనలో తిరుగుతున్నారు' అని మంత్రి మండిపడ్డారు.