ఆర్సీబీ యాజమాన్యం ఎప్పుడూ నాకు వెన్నుదన్నుగా నిలిచిందని విరాట్ కోహ్లీ ప్రకటించారు. ఇదిలావుంటే విరాట్ కోహ్లీ 2008లో ఐపీఎల్ ఆరంభం నుంచి ‘రాయల్ చాలెంజర్స్ బెంగళూరు’ జట్టుకే ఆడుతున్నాడు. మొత్తం 15 సీజన్లకు గాను 8 సార్లు కోహ్లీయే జట్టును నడిపించాడు. కానీ, ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవలేకపోయింది. 217మ్యాచ్ లకు గాను కోహ్లీ 6,469 పరుగులు సాధించాడు. ఒక్కో మ్యాచ్ సగటు స్కోరు 36 పరుగులు. ఇన్నేళ్ల కాలంలో ఎన్నో ఫ్రాంచైజీలు కోహ్లీని సంప్రదించినప్పటికీ.. అతడు ఆర్సీబీతోనే ఉండిపోయాడు.
దీనిపై కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీ యాజమాన్యం ఎప్పుడూ నాకు వెన్నుదన్నుగా నిలిచింది. నన్ను నమ్మింది. ఫామ్ లో లేని సమయంలోనూ నాకు మద్దతుగా నిలిచింది. ముఖ్యంగా ఆరంభ సంవత్సరాల్లో. మొదటి మూడేళ్లలో ఫ్రాంచైజీ నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. నన్ను నమ్మడం అంటే నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఎన్నో సందర్భాల్లో పలు ఫ్రాంచైజీలు నన్ను సంప్రదించాయి. వేలంలోకి రావాలని కోరాయి. కానీ, వారు నాకు మద్దుతుగా లేరు. వారు నన్ను నమ్మలేదు’’ అని కోహ్లీ తెలిపాడు.