సుందరనాయుడు కుటుంభాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పౌల్ట్రీ రంగ దిగ్గజం, బాలాజీ హేచరీస్ అధినేత డాక్టర్ సుందరనాయుడు (85) కొన్నిరోజుల కిందట కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చిత్తూరులో సుందరనాయుడు నివాసానికి చంద్రబాబు నేడు విచ్చేశారు. సుందరనాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుందరనాయుడు కుమార్తె శైలజా కిరణ్, ఆయన అల్లుడు 'ఈనాడు' కిరణ్ (రామోజీరావు కుమారుడు)లతో మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa