అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్పసముద్రం లో ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య తగ్గితే చర్యలు తప్పవని డ్వామా క్లస్టర్ ఏపీడీ కుమార్ రెడ్డి సిబ్బందిని హెచ్చరించారు. ఆయన మండలంలోని ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్ లతో సమీక్షించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పని దినాలు తక్కువగా ఉండడం పై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించేలా చూడాలని చెప్పారు.