ఫెడరల్ ఫ్రంట్ గురించి గతంలో చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఆ దిశగా అడుగులేస్తున్నారా అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. తాజాగా ఆయన చండీగఢ్ రాష్ట్రంలోని 600 కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందించనున్నారు. తన పర్యటనలో భాగంగా కేసీఆర్ మరికొందరు కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆయన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. దేశ పరిస్థితులు, ప్రాంతీయ పార్టీల బలాలు, దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన వంటి అంశాలపై వారు చర్చిస్తున్నారు.
ఇదిలావుంటే దేశ వ్యాప్త పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి వెళ్లనున్నారు. కేజ్రీవాల్‌తో చర్చించి మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం చండీగఢ్ వెళ్లనున్నారు. సాగు చట్టాలపై పోరులో అమరులైన రైతుల కుటుంబాలను ఇరువురు సీఎంలు పరామర్శిస్తారు. వారికి ఆర్థిక సాయం చేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కూడా పాల్గొననున్నారు.