డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఏపీలో రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. తాజాగా ఈ విషయమై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విశాఖలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవమై తేలిన ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించారు. హత్య చేసిన వ్యక్తే మృతదేహాన్ని తీసుకువచ్చి మృతుడి భార్యకు అప్పగించడం జగన్ పాలనలోనే చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతోందని, జగన్ దావోస్ లో ఉండి సజ్జలతో ఈ వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇదిలావుంటే ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల ఎదుట లొంగిపోయారు.