తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి శనివారం గడప గడప కి మన ప్రభుత్వం కార్యక్రమం ఆరవ డివిజన్లో ప్రారంరంభించారు. అంతకుముందు జీవకోన జీవలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్, వైస్సార్సీపీ నాయకులు సురేంద్ర రెడ్డి శాసనసభ్యులు కి ఘన స్వాగతం పలికి, స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.