రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మూడో పట్టణ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఐదుగురు మంగళవారం ఉదయం సుమారు 5. 30 గంటల సమయంలో ఆల్ ఇండియా రేడియోవైపు నుంచి సిరిపురం కూడలికి నడుచుకొని వస్తున్నారు. ఆ దిశగానే అతివేగంగా వచ్చిన కారు వీరిలో ఇద్దరిని ఢీకొంది. ఈ ఘటనలో మధురవాడకు చెందిన సి. హెచ్. వెంకటేష్ (25) అక్కడికక్కడే మృతిచెందాడు. పావనికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సి. ఐ కోరాడ రామారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa