తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు రుక్మిణి, సత్యభామ సమేత కృష్ణస్వామి పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి తెప్పోత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులు ఎక్కువగా రావడంతో తిరుచానూరు కిక్కిరిసిపోయింది.