సప్తనదుల సంగమ ప్రదేశంలో వెలసిన సంగమేశ్వర క్షేత్రానికి వరద తాకిడి నెలకొంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి గత కొన్ని రోజులుగా స్వల్పంగా మొదలైంది. దీంతో సంగమేశ్వరం లోని దిగువ పుష్కర్ ఘాట్ రోజురోజుకు స్వల్పంగా నీట మునుగుతుంది. ప్రస్తుతం శ్రీశైల జలాశయం లో 822 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. మరో 16 అడుగుల వరకు నీటి నిలువలు పెరిగితే సంగమేశ్వరుని గర్భాశయంలోకి సప్తనది జలాలు చేరుకునే అవకాశం ఉంది.