వంటగ్యాస్ సిలిండర్ డిపాజిట్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. 14.2 కిలోల సిలిండర్ డిపాజిట్ ధరను 1,450 నుంచి రూ.2,200 కి పెంచారు. 5 కిలోల సిలిండర్ కు రూ.800 నుంచి రూ.1,150 కు పెంచారు. రెగ్యులేటర్ ధరను రూ.150 నుంచి రూ.250 కి పెంచారు. కొత్త కనెక్షన్లు తీసుకునే వారికి ఇవి వర్తిస్తాయి. ఉజ్వల యోజన వినియోగదారులకు ఈ ధరలు వర్తించవు.