గుంటూరు జిల్లా, నాదెండ్ల మండలంలోని, ఎండుగుంపాలెం, బుక్కాపురం గ్రామాలలో తెదేపా నాయకులు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తి పాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రెండుగ్రామాలలో ఇంటింటికి పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే మార్గంచూడడం జరిగింది. ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్య పెట్టడం సీఎం మానుకోవాలి. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతుంది, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలని పోలీస్ వారితో కేసులు బనాయించి నొక్కుతున్నారు. కానీ ప్రజా క్షేత్రంలోకి వెళ్లిన తర్వాత మాత్రం న్యాయమే గెలుస్తుంది అని తెలియజేసారు. జరుగుతున్నా దుర్మార్గాలని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, అన్నిటికి సమాధానం చెప్పు రోజులు దగ్గరలోనే ఉన్నాయ్ అని హెచ్చరించారు.